నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన పటాస్ చిత్రం ఘనవిజయం సాధించి కళ్యాణ్‌రామ్ కెరీర్‌లోనే అతి పెద్ద హిట్‌గా నిలిచింది. కాగా త్వరలో కళ్యాణ్‌రామ్ షేర్ గా రానున్నాడు. సాయి నిహారిక, శరత్‌చంద్ర సమర్పణలో మల్లికార్జున్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను కొమర వెంకటేష్ నిర్మిస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఆడియోను అక్టోబర్ 10న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. మరి ఇప్పటికే కళ్యాణ్‌రామ్‌కు ఫ్లాప్స్ ఇచ్చిన దర్శకుడు మల్లికార్జున్ ఈ చిత్రంతోనైనా కళ్యాణ్‌రామ్ నమ్మకాన్ని నిలబెట్టి లెక్కను సరిచేస్తాడేమో వేచిచూడాల్సివుంది..!