అనుష్క టైటిల్ రోల్‌లో గుణా టీమ్ వర్క్స్ పతాకంపై శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో డైనమిక్ డైరెక్టర్ దర్శక నిర్మాతగా రూపొందుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి ద్విభాషా చిత్రం రుద్రమదేవి. దాదాపు డెబ్బై కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని తీసి గుణశేఖర్ పెద్ద రిస్కే చేసాడు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయం ఎప్పటినుండో వాయిదా పడుతూ వస్తుంది. మొదట జూన్ 24 న రిలీజ్ చేస్తామని చెప్పి అది కాస్త సెప్టెంబర్ కు వాయిదా వేసారు. మరి సెప్టెంబర్ లో అయిన రిలీజ్ అవుతుందా అనుకుంటే అది కూడా గుణశేఖర్‌కు కలిసి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పుడు కొత్తగా అక్టోబర్ 9 న రుద్రమదేవి ని కన్ఫర్మ్ గా విడుదల చేస్తారని మాటలు వినిపిస్తున్నాయి. ఈ విషయం ఎంతవరకు నిజమో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచిచూడాల్సిందే!