అక్కినేని నాగేశ్వరరావు అంటే డ్యాన్స్‌లో ఓ సెన్సేషన్. తన కెరీర్‌లో ఊపైన పాటలకు తనదైన శైలిలో స్టెప్స్ వేసి ఆ తరం హీరోలలో డ్యాన్స్‌పరంగా ఆయన ఓ స్టైల్‌గా నిలిచిపోయాడు. సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు వంటి హీరోల కంటే డ్యాన్స్‌పరంగా అక్కినేనికే పెద్ద పేరు ఉండేది. ఆ తర్వాత ఆయన తనయుడు నాగార్జున తన కెరీర్ మొదట్లో పెద్దగా డ్యాన్స్‌పరంగా ఆకట్టుకోలేకపోయినా తనదైన ఓ స్టైల్‌తో మేనేజ్ చేశాడు. ఇక నాగచైతన్య ఇప్పటివరకు డ్యాన్స్‌పరంగా తనను తాను ప్రూవ్ చేసుకోలేకపోయాడు. అయితే ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇస్తున్న అక్కినేని అఖిల్ మాత్రం తన తొలిచిత్రం అఖిల్ లో డ్యాన్స్‌లు, యాక్షన్ ఎపిసోడ్స్‌ను ఇరగదీస్తున్నాడని ఫిల్మ్‌నగర్ సమాచారం. ముఖ్యంగా ఆయన తన స్టెప్పులతో అందరినీ ఉర్రూతలూగించడం ఖాయమని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇప్పుడున్న టాప్‌స్టార్స్‌లో డ్యాన్స్‌పరంగా అదరగొడుతున్న వారికి ధీటుగా అఖిల్ డ్యాన్స్ చేశాడని, ముఖ్యంగా డాన్స్ విషయంలో ఆయనది ఓ డిఫరెంట్ స్టైల్‌గా ఉందని అంటున్నారు. ఇటీవల నాగార్జున కూడా అఖిల్ ఫైట్స్, డ్యాన్స్ అద్బుతంగా ఉన్నాయని, మరీ ముఖ్యంగా డాన్స్‌విషయంలో అఖిల్ అందరినీ ఆకట్టుకోవడం గ్యారంటీ అని హామీ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. మొత్తానికి మొదటి సినిమా విడుదల కాకముందే అఖిల్‌ను ఈ చిత్ర యూనిట్ డాన్సింగ్ సెన్సేషన్‌గా పేర్కొంటోంది.