దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం బ్రూస్‌లీ. వాస్తవానికి ఈ చిత్రం ప్రారంభించినప్పుడు ఈ చిత్రానికి కేవలం రామ్‌చరణ్, హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్‌లు మాత్రమే అట్రాక్షన్. అయితే షూటింగ్ మొదలయ్యాక వారానికో స్పెషల్ అట్రాక్షన్‌ను సినిమాకి జోడిస్తున్నాడు దర్శకుడు శ్రీనువైట్ల. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో కీలకపాత్ర చేయించడంతో ఈ సినిమా రేంజ్ అనూహ్యంగా పెరిగిపోయింది. ఇక రామ్‌చరణ్, చిరంజీవిలతో ఓ సాంగ్‌ను జోడీ చేశాడు. మెగాస్టార్‌కు ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశాడు. ఇక రామ్‌చరణ్ సోదరిగా కృతికర్బందాను తీసుకున్నాడు. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో తాను నటించిన చిత్రాలన్నీ సూపర్‌హిట్ అనిపించుకున్న వెటరన్ హీరోయిన్ నదియాకు కీలకపాత్రను అప్పగించాడు. ఇక బాలీవుడ్ నటి టిస్కాచోప్రాను మరో పాత్రకు చోటిచ్చాడు. తాజాగా ఈ తరం హీరోయిన్లలో చిరు మెచ్చిన ఒకే ఒక్క హీరోయిన్ తమన్నాను చిరు, చరణ్‌ల జోడీ పాటలో చిందులేయడానికి రెడీ చేశాడు. ఇలా రోజుకో అట్రాక్షన్‌ను జత చేస్తున్న శ్రీనువైట్ల ఇలా అందరినీ వెండితెర నిండుగా కనిపించేలా ప్లాన్ చేయడం బాగున్నప్పటికీ ఏ పాత్రను బలహీనంగా చేయకుండా ప్రతి పాత్రను కీలకమైనదిగా మలచడం మాత్రం కత్తి మీద సామే అని చెప్పాలి.