Advertisement
Google Ads BL

పవన్ పంజా2 నిజమేనా?


డైరెక్టర్‌ విష్ణువర్థన్‌కు తమిళంలో స్టైలిష్‌ డైరెక్టర్‌గా పేరుంది. ఆ నమ్మకంతోనే అతని దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్‌ పంజా సినిమా చేశాడు. కానీ తెలుగులో మొదటి సినిమాతోనే తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఈ చిత్రం ఫ్లాప్‌ కావడంతో పాటు పవన్‌ అభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. అయినా విష్ణువర్థన్‌కు ఉన్న కాలిబర్‌ ఏమిటో పవన్‌కు బాగా తెలుసు. దాంతో ఇటీవల విష్ణువర్థన్‌.. పవన్‌ని కలిసి ఓ స్టోరీ వినిపించాడట. దానికి పవన్‌ వైపు నుండి కూడా పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చిందని సమాచారం. దాంతో త్వరలో విష్ణు దర్శకత్వంలో పవన్‌ మరో సినిమా చేయనున్నాడనే వార్త ఫిల్మ్‌ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. మొత్తానికి ఈ చిత్రాన్ని పవన్‌ ఓకే చేస్తే మాత్రం ఈసారి తన సత్తా చూపించి లెక్కను సరిచేయాలని విష్ణువర్థన్‌ భావిస్తున్నట్లు సమాచారం. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs