గతంలో ఇతర భాషా నటీమణులు చాలామంది తమ ఓన్ వాయిస్‌తో డబ్బింగ్ చెప్పి మెప్పించారు. ఇప్పుడు అదే కోవలో రకుల్‌ప్రీత్‌సింగ్ కూడా చేరనుంది. ప్రస్తుతం ఆమె తెలుగు బాగానే మాట్లాడుతోంది. ప్రెస్‌మీట్స్‌లో, ఆడియో వేడుకల్లో మాట్లాడుతున్న ఆమె ప్రస్తుతం అల్లుఅర్జున్-బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో రూపొందుతున్న సరైనోడు (వర్కింగ్‌టైటిల్)లో నటిస్తోంది. రకుల్ షూటింగ్ లొకేషన్లలో తెలుగులో బాగా మాట్లాడుతూ ఉండటంతో ఆమె చేతనే ఆమె పాత్రకు డబ్బింగ్ చెప్పించాలని డిసైడ్ అయ్యారట. దానికి రకుల్ సైతం ఎంతో ఆనందంగా ఓకే చేసిందని సమాచారం.