బుల్లితెర జబర్ధస్త్ షోతో హాట్ యాంకర్‌గా పాపులర్ అయింది రష్మీ. ఈ షోతో ఆమెకు ఇప్పుడు వెండితెరపై కూడా అవకాశాలు వస్తున్నాయి. ప్రవీణ్‌సత్తార్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు టాకీస్ చిత్రంలో ఈమె ఓ కీలకపాత్రను చేస్తోంది. ఇప్పుడు సోలో హీరోయిన్‌గా ప్రమోషన్ కొట్టేసింది. కొత్త దర్శకుడు శ్రీనివాస్ ఉయ్యూరు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రేష్మిని ఎంపిక చేశారు. సోలో హీరోయిన్‌గా ఆమెకిదే తొలి అవకాశం. ఈ చిత్రానికి చారుశీల అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. మరి బుల్లితెరపై రాణించిన రష్మీ వెండితెరపై తన సత్తా చాటుతుందా? లేదా? చూడాలి...!