Advertisement
Google Ads BL

భయపడకుండా ఉంటే 5లక్షల రివార్డు..!


నయనతార ప్రధానపాత్రలో మయూరి అనే చిత్రం వస్తోన్న సంగతి తెలిసిందే. తమిళంలో మాయా పేరుతో రూపొందిన ఈ చిత్రానికి ఇది తెలుగు అనువాదం కావడం విశేషం. అశ్విన్‌ శరవణన్‌ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సి.కళ్యాణ్‌ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు. ఏకకాలంలో ద్విభాషా చిత్రంగా ఈ సినిమా తయారైందని, టెక్నికల్‌గా ఉన్నతస్థాయిలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నందుకు ఆనందంగా ఉందని కళ్యాణ్‌ అంటున్నాడు. ఈ హర్రర్‌ సినిమాను చూసి ఎవరయినా భయపడకుండా ఉంటే 5లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తామని ఈ సినిమా నిర్మాతలు సవాల్‌ విసురుతున్నారు. సెప్టెంబర్‌ 17న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇది ఆద్యంతం ఊపిరిబిగపట్టేలా చేసే సూపర్‌ నాచురల్‌ థ్రిల్లర్‌. ఇందులో ఓ పాప తల్లిగా నయనతార కనిపిస్తుంది. కథ మొత్తం ఆమె క్యారెక్టర్‌ చుట్టూ తిరుగుతుంది. నయనతార కెరీర్‌లోనే బెస్ట్‌ ఫిలిమ్‌గా ఈ సినిమా నిలుస్తుందని దర్శకనిర్మాతలు అంటున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs