సెప్టెంబర్ నుండి బాహుబలి2 సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ చిత్రం నెల ఆలస్యంగా అంటే అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుందని తాజా సమాచారం. ఈ నేపథ్యంలో రాజమౌళి సినిమాకు పనిచేసే టెక్నీషియన్స్‌తో సమావేశమైనట్లు సమాచారం. ఈ సమావేశానికి కథారచయిత విజయేంద్రప్రసాద్‌తో పాటు సెంథిల్‌కుమార్ తదితరులు కూడా హాజరయ్యారట. బాహుబలి1 సూపర్‌డూపర్ హిట్ నేపథ్యంలో బాహుబలి2పై అంచనాలు భారీగా ఉన్నాయి. మొదట్లోనే ఈ పార్ట్2కి కథను సిద్దం చేసినప్పటికీ ఈ స్టోరీలో పలు మార్పులు చేస్తున్నట్లు సమాచారం. బాహుబలి1 స్టోరీని తయారు చేసేటప్పుడు రాజమౌళి కేవలం తెలుగు ప్రేక్షకుల అభిరుచికే పెద్దపీట వేశాడు. కానీ ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో ఘనవిజయం సాధిచండంతో పార్ట్2 విషయంలో ఆయన అన్ని భాషల ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో ఉంచుకొని కథలో మార్పులు చేస్తున్నాడు. అలాగే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోని పలువురు నటులను కొత్తగా పార్ట్2కు తీసుకునే యోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది.