ఈమధ్యకాలంలో హీరోయిన్లు కూడా డేరింగ్ అండ్ డాషింగ్‌గా కనిపిస్తున్నారు. ఆఖరికి ఫైట్ సీన్స్‌లో కూడా కనిపిస్తున్నారు. డైనమైట్ చిత్రంలో ప్రణీత అదే చేసింది. ఇప్పుడు సమంత కూడా రంగంలోకి దిగిపోయింది. విక్రమ్, సమంత జంటగా తమిళంలో విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. దాని టైటిల్ 10ఎండ్రాదుకుళ్. ఈ చిత్రంలో సమంత ఫైటింగులు చేసిందట. కొన్ని రిస్కీ షాట్స్‌లోనూ ఎలాంటి డూప్‌లేకుండా నటించేసిందట. అంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు అని అడిగితే... యాక్షన్ సీన్స్‌లో నటించే అవకాశం ఎప్పుడో కానీ హీరోయిన్లకు రాదు. అలాంటప్పుడు నేను కాకుండా మరొకరితో చేయిస్తే కిక్ ఉండదు కదా...! అందుకే నేనే ఆ చాన్స్ తీసుకున్నాను అంటోంది. మరి ఆ ఫైట్స్‌లో సమంత ఎంత ఇరగదీసిందో తెలియాలంటే ఆ సినిమా విడుదలయ్యేవరకు వెయిట్ చేయాల్సివుంది...!