మెగాస్టార్‌చిరంజీవి అంటే అందరికీ గుర్తుకొచ్చేది ఆయన డ్యాన్స్. 60ఏళ్ల వయసులో కుర్రహీరోలతో సమానంగా ఆయన పోటీ పడగలరా? అనే అనుమానం అయితే అందరిలో ఉంది. వాస్తవానికి చిరు స్టెప్ వేస్తే సిల్వర్‌స్క్రీన్ షేక్ అవుతుంది. దీంతో బ్రూస్‌లీ చిత్రంలోని చిరు సాంగ్‌పై ఇప్పటినుండే భారీ అంచనాలు మొదలయ్యాయి. కాగా చిరు పాటకు తమన్ అద్బుతమైన ట్యూన్‌ను సిద్దం చేశాడు. ఇక చిరుతో ఇంద్ర లో వీణ స్టెప్పుతో పాటు పలు సూపర్‌హిట్‌పాటలకు డ్యాన్స్‌కంపోజ్ చేసిన లారెన్స్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందిస్తున్నాడు. అటు దర్శకునిగా, ఇటు హీరోగా బిజీగా ఉన్నప్పటికీ లారెన్స్ మరీ మరీ అడిగి ఈ చాన్స్‌ను చేజిక్కించుకున్నాడని సమాచారం. ఈ పాటలో చిరుతో పాటు చరణ్ కూడా చిందులేయనున్నాడని, ఇలియానా వీరిద్దరితో కలిసి ఆడిపాడనుంందని వార్తలు వచ్చాయి. అయితే ఇలియానా మాత్రం తాను బ్రూస్‌లీ చిత్రంలో ఎలాంటి పాట చేయడం లేదని ఆ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టింది. మొత్తానికి ఇప్పుడు అందరి దృష్టి చిరు సాంగ్‌పై ఉంది. మరి కుర్రహీరోలతో పాటుగా చిరు ఆ స్థాయిలో స్టెప్స్ వేసి ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడు? అనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.