మెగాహీరో వరుణ్‌తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో కంచె చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని క్రిష్ తండ్రి జాగర్లమూడి సాయిబాబు స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం బడ్జెట్ 21కోట్లు అన్నది తెలిసిన విషయమే. ఈచిత్రాన్ని అక్టోబర్2 వతేదీన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా విడుదల తేదీ దగ్గరయ్యే కొద్ది బిజినెస్ ఊపందుకొంది. ఓవర్‌సీస్‌లో సైతం ఈ చిత్రం మంచి రేటుకు అమ్ముడుపోయింది. ఓవర్‌సీస్‌లో కొత్తగా డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌లోకి ప్రవేశించిన అబ్సల్యూట్ తెలుగు సినిమా వారు ఈ చిత్రం రైట్స్‌ను కోటిపాతిక లక్షలకు కొన్నారు. ఈ కంపెనీని కొంతమంది ఎగ్జిబిటర్స్ కలిసి ఏర్పాటు చేశారు. మరి కంచె చిత్రం ప్రేక్షకులను ఏవిధంగా అలరిస్తుందో వేచిచూడాల్సివుంది.