అతిలోకసుందరిగా భారత సినీ పరిశ్రమను తన అందచందాలతో ఆకట్టుకొన్న తమిళపొన్ను శ్రీదేవి. ఆమె చాలా గ్యాప్ తర్వాత ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. విజయ్ హీరోగా చింబుదేవన్ డైరెక్షన్‌లో హన్సిక, శృతిహాసన్ హీరోయిన్‌గా సుదీప్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం టైటిల్ పులి. ఈ చిత్రం అక్టోబర్1వ తేదీన తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలకు ఒకేసారి సిద్దమవుతోంది. ఈ చిత్రంలో శ్రీదేవి మహారాణి పాత్రను పోషిస్తోంది. కాగా ఈ చిత్రంలో శ్రీదేవి నటిస్తుండటంతో తెలుగులో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అందునా ఈ చిత్రం 125కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం కావడం విశేషం. కాగా తెలుగు అనువాద హక్కులను పొందిన నిర్మాతలు తెలుగులో కూడా శ్రీదేవి పాత్రకు ఆమె చేతనే డబ్బింగ్ చెప్పిస్తున్నారని సమాచారం. ఇలా తెలుగులో డబ్బింగ్ చెప్పినందుకు గాను శ్రీదేవి కోటిరూపాయలు డిమాండ్ చేసి సాధించుకొందని తెలుస్తోంది.