నాగార్జున అనుష్క కలిసి ఎన్నో చిత్రాల్లో నటించారు. వీరిద్దరు ఒకరి సినిమాను మరొకరు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే నాగ్, అనుష్క నటిస్తున్న సైజ్ జీరో చిత్రంలో ఓ గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడు. అలానే అనుష్క కూడా నాగార్జున నటిస్తున్న చిత్రంలో చిన్న పాత్రలో కనిపించడానికి ఒప్పుకుంది. నాగార్జున, కార్తి కలసి వంశీ పైడి పల్లి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఊపిరి అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం.
అయితే ఈ చిత్రంలో అనుష్క కీ రోల్ పోషిస్తున్న ఆ పాత్ర ఏంటో తెలిసిపోయింది. సినిమాలో నాగార్జునకు మాజీ లవర్ గా స్వీటీ కనిపించనుందని సమాచారం. నాగ్ కు బ్రేక్ చెప్పేసి వెళ్ళిపోయిన స్వీటీ కొన్నాళ్ళ తర్వాత మళ్లీ తన లైఫ్ లోకి ఎంటర్ అవుతుందట. ఈ సినిమాలో అనుష్క స్క్రీన్ పై కనిపించే సమయం తక్కువైనప్పటికీ చాలా ముఖ్యమైన పాత్రని చిత్రబృందం చెబుతున్నారు.