Advertisement
Google Ads BL

బ్రూస్‌లీకి పవర్‌ అట్రాక్షన్‌...!


రామ్‌చరణ్‌ హీరోగా చిరంజీవి గెస్ట్‌పాత్రలో శ్రీనువైట్ల దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న బ్రూస్‌లీ చిత్రానికి మరో అదనపు హంగు చేపట్టాలని మెగా ఫ్యామిలీ ఆలోచిస్తోంది. ఈ చిత్రంలోని రామ్‌చరణ్‌ పాత్రను ఇంట్రడ్యూస్‌ చేస్తూ వచ్చే వాయిస్‌ ఓవర్‌కు పవన్‌ అయితే సరిగ్గా సరిపోతాడనే ఉద్దేశ్యంతో శ్రీనువైట్ల ద్వారా పవన్‌కు సమాచారం అందించినట్లు సమాచారం. వాస్తవానికి ఓ హీరో సినిమాకు మరో హీరో వాయిస్‌ఓవర్‌ ఇవ్వడం కొత్తేమీ కాదు. కానీ పవన్‌ మాత్రం ఇప్పటివరకు ఏ సినిమాకు వాయిస్‌ఓవర్‌ ఇవ్వలేదు. మరి దీనికి పవన్‌ కనుక ఒప్పుకొంటే బ్రూస్‌లీ చిత్రానికి మరో అదనపు హంగు ఏర్పడినట్లే చెప్పవచ్చు.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs