Advertisement
Google Ads BL

కిక్‌2 ఫ్లాప్‌తో రూట్‌ మార్చుతున్న రవితేజ.!


వరస ఫ్లాపుల తర్వాత బలుపు, పవర్‌ చిత్రాలతో ఫామ్‌లోకి వచ్చిన రవితేజని లేటెస్ట్‌గా వచ్చిన కిక్‌2 మళ్ళీ వెనక్కి నెట్టింది. ఈ సినిమాపై ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకున్న రవితేజ ఈ రిజల్ట్‌ చూసి షాక్‌ అయ్యాడు. ఈ ఎఫెక్ట్‌ రవితేజ నెక్స్‌ట్‌ మూవీ బెంగాల్‌ టైగర్‌పై పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో వున్న రవితేజ డెఫినెట్‌గా హిట్‌ కొట్టాలన్న కసితో వర్క్‌ చేస్తున్నాడట. ఇక బెంగాల్‌ టైగర్‌ తర్వాత చేయబోయే సినిమా రవితేజకి స్పెషల్‌ మూవీ కాబోతోంది. ఆమధ్య తెలుగులో సిద్ధార్థతో ఓ మై ఫ్రెండ్‌ చిత్రాన్ని రూపొందించిన వేణు శ్రీరామ్‌ని తన నెక్స్‌ట్‌ మూవీ డైరెక్టర్‌గా సెలెక్ట్‌ చేసుకున్నాడు రవితేజ. 

Advertisement
CJ Advs

ఇప్పటివరకు మాస్‌ కామెడీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌తో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన రవితేజ తన నెక్స్‌ట్‌ మూవీ విషయంలో ఓ కొత్త నిర్ణయం తీసుకోబోతున్నాడట. వేణు శ్రీరామ్‌ చెప్పిన కథకి ఫ్లాట్‌ అయిన రవితేజ ఈ సినిమాతో తన రూటు మార్చుకోవడానికి సిద్ధపడుతున్నాడు. క్లాస్‌ టచ్‌ వున్న సబ్జెక్ట్‌తో రూపొందే ఈ సినిమా రవితేజ కెరీర్‌లో ఓ డిఫరెంట్‌ మూవీ అవుతుందట. బెంగాల్‌ టైగర్‌ తర్వాత రవితేజ చేయబోయే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs