రాజమౌళి దర్శకత్వంలో హీరోగా చాన్స్ వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఆ సినిమా విడుదలై ఘనవిజయం సాధించిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. రాజమౌళి తీసిన సినిమాతో అందరూ ఆ తర్వాత చిత్రాలను ఆ సినిమాతోనే పోల్చి చూస్తారు. దాంతో ఆయా హీరోలకు వరుసగా ఫ్లాప్‌లు తప్పవు. గతంలో ఎన్టీఆర్, రవితేజ, ప్రభాస్, రామ్‌చరణ్, నాని... వంటి వారు ఇలా ఇబ్బందులు పడిన వారే కావడం విశేషం. నానికి అయితే ఈగ తర్వాత మూడేళ్లకు పైగా హిట్‌లేదు. ఎటో వెళ్లిపోయింది మనసు, ఆహా కళ్యాణం, పైసా, జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రమణ్యం... ఇలా ఆయన నటించిన చిత్రాలన్నీ పెద్దగా ఆడలేదు. మొత్తానికి భలే భలే మగాడివోయ్ చిత్రం హిట్ టాక్ తెచ్చుకోవడంతో నాని ఊపిరి పీల్చుకున్నాడు. రాజమౌళి ఎఫెక్ట్ నుండి బయట పడ్డానని ఆనందంగా ఉన్నాడు. మరి ఈగ2లో నటించాలా? వద్దా? అనే డైలమాలో నాని ఉన్నట్లు సమాచారం.