ఈ సీజన్‌లో ఇప్పటికే బాహుబలి1 చరిత్రను తిరగరాసే విజయాన్ని నమోదు చేసుకొంది. ఆ వెంటనే వచ్చిన మహేష్‌బాబు శ్రీమంతుడు కూడా అదే జోరును కొనసాగిస్తూ అత్యద్బుత విజయాన్ని నమోదు చేస్తోంది. దీంతో టాలీవుడ్ మార్కెట్ రేంజ్ పెరిగిందని ట్రేడ్ వర్గాలు సంతోషపడుతుంటే... ఈ సీజన్‌లో వచ్చిన చిన్న సినిమాలు కూడా తమ జోరును కొనసాగిస్తున్నాయి. కిక్2 వంటి పెద్ద చిత్రంతో పోటీపడిన సినిమా చూపిస్త మావా చిత్రం పెద్ద సినిమాల పోటీని ధీటుగా ఎదుర్కొని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం నమోదుచేసుకొంది. ఇక ఇటీవల వచ్చిన నాని భలే భలే మగాడివోయ్ కూడా హిట్టు దిశగా కొనసాగుతోంది. మంచు విష్ణు నటించిన డైనమైట్‌కు యాక్షన్ సినిమా ప్రియులను అలరిస్తూ.. డిఫరెంట్ సినిమాగా పేరుతెచ్చుకుంది. ఇక రాబోయే కంచె, సైజ్‌జీరో, శివమ్, రుద్రమదేవి, బ్రూస్‌లీ, అఖిల్, కొరియర్‌బోయ్ కళ్యాణ్, సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రాలు కూడా తమ హవా చూపిస్తే.. ఈ సీజన్ టాలీవుడ్‌కు మరపురానిదిగా మిగిలిపోతుంది...!