దర్శకుడు విక్రమ్ కె.కుమార్ చేసింది తక్కువ సినిమాలే ఆయన తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కినేని మూడు తరాల హీరోలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి మనం తో ఓ మ్యాజిక్ చేశాడు. మనం తర్వాత విక్రమ్‌కు బోలెడు ఆఫర్లు వచ్చాయి. అయితే ఆయన మళ్లీ తనదైన స్టైల్‌లోనే తొందరపడకుండా నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన సూర్య హీరోగా 24 అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పుడు ఆయన తాజాగా అల్లుఅర్జున్ కోసం ఓ కథ రెడీ చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం బన్నీ బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నాడు. విక్రమ్ 24 హడావుడిలో ఉన్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత బన్నీ-విక్రమ్‌ల కాంబినేషన్‌లో సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఇదో క్యూట్ లవ్‌స్టోరీ అని అంటున్నారు. ఆర్య2 తర్వాత చాలాకాలానికి అల్లుఅర్జున్ చేయబోతున్న ఈ లవ్‌స్టోరీని విక్రమ్ కుమార్ ఎలా డీల్ చేస్తాడో చూడాల్సివుంది?