Advertisement
Google Ads BL

హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్..!


పవన్ కళ్యాణ్ .. ట్రెండ్ ను ఫాలో కాడు.. ట్రెండ్ సెట్ చేస్తాడు.. మల్టీటాలెంటెడ్..  ఇతర హీరోలకు భిన్నమైన ఆలోచనా ధోరణితో ఉంటాడు. చిన్న వయసులోనే సినిమా దర్శకుడిగా మారాడు. ఫైట్స్, డ్యాన్స్ లు కంపోజ్ చేయగలడు. తన సినిమాల్లో అద్భుతమైన పాత పాటలను రీమిక్స్ చేస్తాడు.. తనూ పాడతాడు. వేరే భాషలోనూ తన సినిమాల్లో పాటలు పెట్టగల టాలెంటెడ్. మొత్తంగా రాజకీయంగానూ తెలుగు ప్రజారాజ్యంలో తిరుగులేని అభిమాన జనసేనను సంపాదించుకున్న ఈ గబ్బర్ సింగ్ పుట్టిన రోజు నేడు. 
చిరంజీవి మెగాస్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న టైమ్ లోనే తన రెండో సినీ వారసుడిగా కళ్యాణ్ బాబును రంగంలోకి దించాడు. చూడగానే పక్కింటి కుర్రాడిలా కనిపించిన పవన్ పై భారీ అంచనాలే పెట్టుకున్నారు మెగా అభిమానులు. వారి కోసమే కాకుండా ఇండస్ట్రీకి తానేంటో నిరూపించాలనే తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో అదిరిపోయే మార్షల్ ఆర్ట్స్  రియల్ స్టంట్స్ చేసి వారెవ్వా అనిపించాడు పవన్. ఆ పై గోకులంలో సీత అంటూ సాఫ్ట్ స్టోరీ చేసీ మెప్పించాడు.. తొలి రెండు సినిమాలతో ఇండస్ట్రీని ఆకట్టుకున్నా.. కమర్షియల్ గా అద్భుతమైన విజయాలైతే కాదు. మూడో సినిమా సుస్వాగతం. ఓ తమిళ చిత్రానికి అనువాదంగా వచ్చిన మూవీ. సినిమా హిట్ అయింది కానీ.. క్రెడిట్ అంతా కామెడీగా వెళ్లిపోయింది. కానీ ఆఖర్లో రియలైజ్ అయ్యే ఒన్ సైడ్ లవర్ గా పవన్ నటన ఇప్పటికీ అలరిస్తూనే ఉంది.  తర్వాత వచ్చింది.. పవన్ అంటే పిచ్చిపట్టేలా అభిమానించే సినిమా. పవన్ ను తమ ఆరాధ్య నాయకుడిగా మార్చుకున్న సినిమా అది. అలాంటి సినిమా ఒక్కసారైనా చేయాలని.. ఎంతో మంది హీరోలు.. దర్శకులు కలలు కంటోన్న సినిమా అది. అదే తొలి ప్రేమ. తొలి ప్రేమలోని మాధుర్యాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించిన సినిమా అని అందరూ అనుకుంటారు.. కానీ ఆ మాధుర్యాన్ని తన నటనతో ప్రతి కుర్రాడు తనను తాను చూసుకునేలా చేశాడు పవన్.. అందుకే ఆ సినిమా అతనికే కాదు.. అతన్ని ఆరాధించడం మొదలుపెట్టిన ప్రతి వారికీ స్పెషల్ అయింది. పవన్ కళ్యాణ్ ముందు నుంచీ భిన్నమైన ధోరణిలోనే ఉండేవాడు. కామ్ గోయింగ్. సినిమాల్లో కనిపించే హడావిడీ అతని లైఫ్ స్టైల్ లో కనిపించదు. అభిమానులు పెరుగుతున్నా అతనిలో అహంకారం పెరగలేదు. అది ఫ్యాన్స్ కు ఇంకా బాగా నచ్చింది. తనకు తెలిసిన అన్ని విద్యలకు వెండితెరపై ప్రదర్శించడం పవన్ స్టైల్. తమ్ముడులో జానపద శైలిలో పాడినా.. బద్రిలో రెండు పాటలకు డ్యాన్స్  కంపోజింగ్  చేసుకున్నా అది అవి తనకు నచ్చితేనే చేసుకున్నాడు. చిరంజీవి తమ్ముడుగా కాకుండా తొలి ప్రేమతో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు పవన్. ఇక తమ్ముడు సినిమా తర్వాత ఎంతో మంది కుర్రాళ్లు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారంటే అతిశయోక్తి కాదు. క్లైమాక్స్ ఫైట్ లో పవన్ చేసిన స్టంట్స్ టాలీవుడ్ కే కొత్తగా అనిపించాయి.. ఇక తొలిప్రేమతో అతన్ని అభిమానించడం మొదలుపెట్టిన ఎంతో మందికి అతని మేనియా సోకింది మాత్రం ఖుషీతోనే. కాలేజ్ స్టూడెంట్ గా పవన్ చేసిన ఖుషీ టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాలోనే పూర్తిగా హిందీ లిరిక్స్ తో పాట పెట్టి ఆశ్చర్యపరిచాడు. సిద్దూ సిద్ధార్థ్ రాయ్.. బెంగాల్ టైగర్ అంటూ పవన్ చెప్పిన డైలాగులు కుర్రకారును ఊపేశాయి. ఖుషీలాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత పవన్ లో కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిందో లేక, ఎప్పటి నుంచో అనుకుంటున్న దానికి అదే సరైన టైమ్ అనుకున్నాడో కానీ, సడెన్ గా మెగా ఫోన్ పట్టేశాడు. జానీ సినిమాతో దర్శకుడిగా మారాడు. బద్రి బ్యూటీ రేణుదేశాయ్ హీరోయిన్ గా.. మొదలైన ఆ సినిమా విడుదలయ్యేంత వరకూ నిత్యం వార్తల్లో సంచలనంగానే ఉంది. కానీ పూర్తిగా మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ నేపథ్యంలో వచ్చిన జానీ రిజల్ట్ నిరుత్సాహపరిచింది. ఈ విషయంలో అటు అభిమానులే కాదు, పవన్ కూడా చాలా డిజప్పాయింట్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. జానీ పోయినా అది తగ్గలేదు. కానీ జానీతో మొదలైన పరాజయ పరంపర అదే పనిగా కొనసాగింది. ఈ ఫీల్డ్ లో జయాపజయాలు ఎవరికైనా కామన్.. కానీ పవన్ కు కాదు అన్నట్టుగా ఫ్లాపులు పట్టుకున్నాయి. కానీ ఆశ్చర్యంగా పవన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు సరికదా ఇంకా పెరుగుతూనే ఉంది. గబ్బర్ సింగ్ కు ముందు వరకూ జల్సా ను మినిహాయిస్తే దాదాపు ఎనిమిది ఫ్లాపులు అతని ఖాతాలో ఉన్నాయి. జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం, కొమురం పులి, తీన్ మార్, పంజా.. ఇలా అన్నీ ఫ్లాపులే. కానీ ఒకటీ రెండు సినిమాలకు తప్ప ఏ నిర్మాతా పెద్దగా నష్టపోలేదు. అయితే హిట్ కోసం పవన్ చేయని ప్రయత్నమే లేదు. యాక్షన్ నుంచి అన్నవరం లాంటి సిస్టర్ సెంటిమెంట్ సినిమాల వరకూ.. హీరోయిన్ లేని బంగారం నుంచి మాఫియా డాన్ లాంటి పంజా వరకూ ఎన్నో చేశాడు. 
దాదాపు పదేళ్ల తర్వాత పవన్ కు అతని స్థాయికి తగ్గ హిట్ వచ్చింది. 2012లో వచ్చిన ఆ కలెక్షన్ సునామీ గబ్బర్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఇన్నాళ్ల నిరీక్షణకు తెరపడింది. గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కుంభవృష్టి కురిపించింది.. అన్ని రికార్డులను తిరగరాసింది. తర్వాత బద్రి కాంబినేషన్ లో పూరీ జగన్నాథ్ తో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా చేశాడు. కానీ అది కాస్తా అంచనాలను అందుకోలేకపోయింది. కానీ పవన్ లోని ఫైర్ ను మాత్రం అంతో ఇంతో చూపించగలిగాడు పూరీ. మరోవైపు వివాదాలు కూడా ఆ సినిమా పరాజయానికి కారణంగా నిలిచాయి.  ఇక 2013లో వచ్చిన అత్తారింటికి దారేదీ మరో బ్లాక్ బస్టర్ అయింది. మళ్లీ అన్ని రికార్డులను తుడిచిపెట్టేసిందా సినిమా. విడుదలకు ముందే గంటన్నర సినిమా పైరసీకి గురైనా అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేసిందంటే కారణం పవన్ కళ్యాణ్ క్రేజే. ఇక అత్తారింటికి దారేదీ క్లైమాక్స్ లో తన ఇమేజ్ భిన్నమైన నటనతో తొలిప్రేమ తర్వాత ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించాడు పవన్.  రాజకీయంగా అన్నయ్య స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి యువనేతగా కీలక బాధ్యతలే చూసుకున్నాడు పవన్. కానీ ప్రజారాజ్యం అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడం, ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో అన్నయ్యతోనే విభేదించాడు. మధ్యలో ప్రేమించి పెళ్లి చేసుకున్న రేణుదేశాయ్ తో విడాకులు ఎంతో మందిని ఆశ్చర్యపరిచాయి. ఇక రీసెంట్ గా తనే జనసేన పార్టీని స్థాపించి..రియల్ పవర్ స్టార్ అనిపించుకున్నాడు. మధ్యలో అభిమానుల కోసం గోపాలా గోపాలాగా మెప్పించాడు.  ప్రస్తుతం పవన్ అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో బిజీగాఉన్నాడు. ఎవరెన్ని విమర్శలు చేసినా తను నమ్మిన దాని కోసం హండ్రెడ్ పర్సెంట్ కష్టపడుతున్నాడు. ఓ రకంగా పవన్ సాధించిన విజయాల కంటే.. ఆయన వ్యక్తిత్వమే ఎక్కువ మంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. తానో సెలబ్రిటీ అన్న విషయాన్ని పక్కన బెట్టి సాధారణ జీవితాన్నే గడుపుతుంటారు.. మరోవైపు ఫామ్ హౌస్ లో రైతుగానూ తన అభిరుచిని నెరవేర్చుకుంటున్నాడు. ఇక అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన గబ్బర్ సింగ్ సీక్వెల్ స్టార్ట్ అయింది. సర్దార్ గబ్బర్ సింగ్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ మరోసారి అభిమానులను ఫుల్ మీల్స్ అవుతుందని చెబుతున్నారు. వారి కోసమే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు పవన్. మరి పవన్ సినిమా సూపర్ హిట్ అయి, అతని, అభిమానుల కోరిక నెరవేరాలని కోరుకుంటూ మరోసారి సర్దార్ పవన్ కళ్యాణ్ కు బర్త్ డే విషెస్ చెబుదాం.. 

Click Here >to see Sardaar Gabbar Singh Official Teaser

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs