Advertisement
Google Ads BL

భలేభలే లాభాలండి!


మారుతి సినిమా అంటే మినిమమ్‌ గ్యారంటీ అని చెప్పవచ్చు. ఇక అతనికి నాని తోడయ్యాడంటే మరింత నమ్మకం. ఇక ఏకంగా ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌ వంటి సంస్థ నిర్మిస్తోందంటే ఎక్కడ లేని భరోసా వస్తుంది. అందుకే 'భలే భలే మగాడివోయ్‌'కి మార్కెట్‌ అంతా సాఫీగా జరిగిపోయింది. ఓ చిన్న సినిమా కూడా టేబుల్‌ ప్రాఫిట్‌తోనే విడుదల కాబోతోంది. మూడు ముఖ్యమైన ఏరియాలు నిర్మాతల చేతుల్లోనే ఉన్నాయి. మిగిలిన ఏరియాల బిజినెస్‌ పూర్తయింది. ఇప్పుడు శాటిలైట్‌ కూడా అయిపోయింది. మాటీవీ వారు ఈ సినిమా హక్కులను 3.6కోట్లకు కొనుకున్నారు. ఇవ్వన్నీ కలిపితే 'భలే భలే మగాడివోయ్‌'కి భలే రేటు వచ్చినట్లే... ఇటీవలే విడుదలైన 'సినిమా చూపిస్త మావ' టేబుల్‌ ప్రాఫిట్‌తో విడుదలైంది. ఇప్పుడు ఆ సరసన 'భలే భలే మగాడివోయ్‌' కూడా చేరిపోయింది. చిన్న సినిమాలకు ఇంతకంటే శుభవార్త ఏముంటుంది...? 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs