Advertisement
Google Ads BL

మెగాస్టారూ! ఇది మీకు తగునా సారూ.!


సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల తర్వాత స్వయంకృషికి నిర్వచనం ఎవరూ అంటే ఠక్కున చిరంజీవి పేరు చెప్తారు. నటుడుగా పేరు తెచ్చుకోవడం కోసం, హీరోగా నిలబడడం కోసం అతను ఎంత స్ట్రగుల్‌ అయ్యాడో, స్టార్‌గా ఎదిగిన తర్వాత ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కూడా అంతే స్ట్రగుల్‌ అయ్యాడు. హీరోగా టర్న్‌ అయి ఆ తర్వాత సుప్రీమ్‌స్టార్‌గా, మెగాస్టార్‌గా ఎన్నో లక్షల అభిమానుల్ని సంపాదించుకున్న చిరంజీవికి మొదటి నుంచీ సపోర్ట్‌గా నిలిచింది హితులు, సన్నిహితులే కాదు, జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు కూడా. అతనికి హీరో అయ్యే లక్షణాలు వున్నాయని, మంచి బ్రేక్‌ వస్తే తప్పకుండా పెద్ద స్టార్‌ అవుతాడని నమ్మిన జర్నలిస్టులు అతన్ని ఎంతో ఎంకరేజ్‌ చేశారు. హీరోగా ఒక స్టేజ్‌కి రాకముందు జర్నలిస్టుల్ని స్నేహితులుగా, శ్రేయోభిలాషులుగా ట్రీట్‌ చేసిన చిరంజీవి స్టార్‌ ఇమేజ్‌ వచ్చిన తర్వాత వారిని పక్కన పెట్టాడు. అయినా జర్నలిస్టులు తమ శాయశక్తులా అతన్ని అన్నివిధాలుగా ప్రమోట్‌ చేసేందుకే ప్రయత్నించారు. ఆఖరికి రాజకీయాల్లోకి వెళ్తున్నప్పుడు కూడా వారి శక్తి మేరకు సపోర్ట్‌ చేశారు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళడం, అక్కడ భంగపడడం, తిరిగి కాంగ్రెస్‌లో చేరడం.. ఇలా అన్నీ జరిగిపోయాయి. మళ్ళీ అతను సినిమాల్లోకి రావాలనుకుంటున్నాడని, 150వ సినిమా చెయ్యడానికి ఉత్సాహం చూపిస్తున్నాడని, ఆ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తనయుడు రామ్‌చరణ్‌ నిర్మించబోతున్నాడని ఇలా అనేక కథనాలతో మళ్ళీ చిరంజీవికి సినిమా ఇమేజ్‌ని పెంచేశారు. 

Advertisement
CJ Advs

అంతే కాదు అతని తర్వాత పవన్‌ కళ్యాణ్‌, నాగబాబు, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, సాయిధరమ్‌తేజ్‌, అల్లు శిరీష్‌, వరుణ్‌ తేజ్‌... ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఇండస్ట్రీ ఆహ్వానం పలికింది. జర్నలిస్టులు, మీడియా కూడా చిరంజీవిని ఎలా ఎంకరేజ్‌ చేశారో ఆయన ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలను కూడా అలాగే ప్రోత్సహించారు. 

ఇదిలా వుంటే ఈమధ్య చిరంజీవి తన 60వ పుట్టినరోజు వేడుకను ఎంతో ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ రంగాలకు చెందిన ఎంతో మంది ప్రముఖులను ఈ వేడుకకు ఆహ్వానించడం జరిగింది. ఈ వేడుకను కవర్‌ చేసేందుకు ఎంతో ఉత్సాహం చూపించిన జర్నలిస్టులకు, మీడియాకు, ఫోటోగ్రాఫర్స్‌కు మాత్రం ఆహ్వానం అందలేదు సరికదా పర్సనల్‌ ఇంట్రెస్ట్‌తో, అభిమానంతో వెళ్ళిన ఫోటోగ్రాఫర్లను కేవలం రెడ్‌ కార్పెట్‌ వరకే పరిమితం చేశారు. అంతకుముందు చిరంజీవి రాజకీయాల్లోకి వెళుతున్న సందర్భంలో కూడా ఇండస్ట్రీ ప్రముఖులను ఆహ్వానించి వారికి పార్టీ ఇచ్చారు. అప్పుడు కూడా అతనికి జర్నలిస్టులు గుర్తు రాలేదు. 

36 ఏళ్ళ కెరీర్‌లో తన ఎదుగుదలకు కారణమైన జర్నలిస్టులను, ఫోటో జర్నలిస్టులను, మీడియాను ఆహ్వానించకుండా ఇండస్ట్రీ ప్రముఖుల సమక్షంలోనే 60వ పుట్టినరోజు వేడుకను జరుపుకోవడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. మీడియాతో అవసరం వున్నప్పుడు తప్ప ఎలాంటి వేడుకలకు దగ్గరికి రానివ్వని చిరంజీవి తన షష్టిపూర్తికి కూడా వారిని విస్మరించడం అందర్నీ విస్మయ పరిచింది. ఎదుగుతున్నప్పుడు చెయ్యి అందించి ప్రోత్సహించిన జర్నలిస్టులను ఏరు దాటి తెప్ప తగలేసిన చందంగా తన పని తాను చేసుకుపోవడం చూస్తుంటే అతనికి పాలిటిక్స్‌ బాగానే వంటబట్టినట్టు కనిపిస్తోంది. తమ వల్లే చిరంజీవి స్టార్‌ అయ్యాడని, తమ వల్లే చిరంజీవి ఈ స్టేజ్‌లో వున్నాడని జర్నలిస్టులు ఏరోజూ చెప్పుకోలేదు, చెప్పుకోరు కూడా. వారు కోరుకునేది జర్నలిస్టులకు ఇచ్చే కనీస మర్యాద. ఆ మర్యాద ఇప్పుడు చిరంజీవిలో కొరవడిందన్నది మాత్రం నిజమేనన్నది ఎవరూ కాదనలేని నిజం. 

చిరంజీవిగారూ... ఏకాకిగా వచ్చారు, స్వయంకృషితో ఎదిగారు, ఎదిగే క్రమంలో జర్నలిస్టుల సహాయ సహకారాలు కూడా తీసుకున్నారు. అలా 36 ఏళ్ళ నటజీవితాన్ని కొనసాగించారు. మీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు మీరు ఇచ్చే మర్యాద ఇదేనా. మెగాస్టారూ! ఇది మీకు తగునా సారూ!

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs