'దృశ్యం' చిత్రం మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళ్‌లో మంచి విజయం సాధించింది. అదే నమ్మకంతో ఈచిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు. మీనా నటించిన పాత్రను ఇందులో శ్రియ పోషించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. బాలీవుడ్‌లో ఒక్క హిట్టు కోసం పరితపించిపోతున్న శ్రియకు ఈ సినిమా అనుకోని వరంలా తగిలింది. శ్రియకు అక్కడ కాస్త క్రేజ్ వచ్చింది. ఈ తరహా పాత్రలకు శ్రియను ఓ మంచి ఆప్షన్ అని దర్శకనిర్మాతలు నమ్ముతున్నారు. అయితే ఓ నిర్మాత మాత్రం శ్రియ క్రేజ్‌ను క్యాష్ చేసుకొనే ప్రయత్నంలో ఉన్నాడు. అప్పుడెప్పుడో తెలుగులో విడుదలై అట్టర్‌ఫ్లాప్ అయిన 'పవిత్ర' సినిమాని ఆయన హిందీలో డబ్ చేస్తున్నాడు. 'దృశ్యం' చూసిన కళ్లతో ఈ సినిమా చూస్తే జనాలు బెంబేలెత్తిపోవడం ఖాయం. కానీ శ్రియ పోస్టర్ చూసి జనాలు థియేటర్‌కి వస్తారని సదరు నిర్మాత నమ్మకంగా ఉన్నాడు. ఈ కళాఖండానికి 'జిస్మ్‌కి ఆగ్2' అనే టైటిల్ కూడా పెట్టాడు. మరి ఈ డబ్బింగ్ సినిమా ఏ రేంజ్‌లో ఆడుతుందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచిచూడాలి...!