చాలాకాలంగా హిట్లు లేని క్రియేటివ్ జీనియస్ మణిరత్నం ఎట్టకేలకు 'ఓకే బంగారం' (ఓకే కన్మణి) ద్వారా హిట్ కొట్టి రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు. ఆయన తదుపరి చిత్రం ఏమిటి? అనే విషయంలో చాలా వార్తలు షికారు చేసాయి. ఎట్టకేలకు ఆయన తన తదుపరి చిత్రం ఏమిటో అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు. ఆయన తన తదుపరి చిత్రాన్ని హీరో కార్తి, దుల్కర్ సల్మాన్‌లతో తెరకెక్కించనున్నాడు. ఈ సంవత్సరాంతంలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది సమ్మర్‌కు ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీపోడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈచిత్రానికి ఇంకా టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేయలేదు. కానీ ప్రస్తుతానికి 'కోమలి' అనే పేరుతో ఈ ప్రాజెక్ట్‌ను పిలుస్తున్నారు. ఈ చిత్రానికి ఎ.ఆర్ రహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. మరి కార్తీ, దుల్కర్ సల్మాన్‌ల సరసన ఎవరు హీరోయిన్లుగా నటిస్తారు? అనేది నిర్ణయం కాలేదు. కోలీవుడ్ మీడియా మాత్రం ఈ చిత్రాన్ని మణిరత్నం ఎప్పుడు తీసిన కార్తీక్, మోహన్, రేవతిల 'మౌనరాగం' సినిమానే మరలా రీమేక్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి ఏ విషయం త్వరలోనే మణిరత్నం అఫీషియల్‌గా ప్రకటించనున్నాడు.