Advertisement
Google Ads BL

సునీల్‌ నో చెప్పిన చిత్రంలో అల్లరినరేష్‌!


రీసెంట్‌గా 'జేమ్స్‌బాండ్‌' అంటూ వచ్చిన అల్లరినరేష్‌ను ఆ చిత్రం కూడా పరాజయాల నుండి బయట పడవేయలేకపోయింది. కాగా ప్రస్తుతం అల్లరినరేష్‌ మోహన్‌బాబుతో కలిసి 'మామ మంచు.. అల్లుడు కంచు' అనే చిత్రంలో చేస్తున్నాడు. ఈ చిత్రం కూడా ఓ మరాఠి చిత్రానికి రీమేక్‌గా తయారవుతోంది. తాజాగా అల్లరినరేష్‌ మరో రీమేక్‌ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. కన్నడలో విజవంతమైన 'విక్టరీ' అనే చిత్రాన్ని తెలుగులో అల్లరినరేష్‌తో తీయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. గతంలో 'సిద్దూ ఫ్రమ్‌ శ్రీకాకుళం' చిత్రానికి దర్శకత్వం వహించిన ఈశ్వర్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, చలసోరి రామబ్రహ్మం తమ గోపీఆర్ట్స్‌ బేనర్‌పై నిర్మించనున్నాడు. వాస్తవానికి దర్శకనిర్మాతలు తొలుత ఈ చిత్రాన్ని సునీల్‌తో రీమేక్‌ చేయాలని భావించారు. కానీ ఈ చిత్రంలోని సన్నివేశాలు ఎప్పుడో తెలుగులో వచ్చిన సన్నివేశాలను పోలివుండటం, ఆల్‌రెడీ ఈ సినిమాలోని క్లైమాక్స్‌ సునీల్‌ నటించిన 'భీమవరం బుల్లోడు'లో వాడుకొని ఉండటం మూలంగా దీనిపై సునీల్‌ ఆసక్తి చూపలేదు. మరి ఈ 'విక్టరీ' రీమేక్‌ అల్లరినరేష్‌కు ఎలాంటి అనుభవాన్ని మిగిలిస్తుందో వేచిచూడాల్సివుంది...! 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs