Advertisement
Google Ads BL

నాగబాబు కూడా ఉన్నాడట!


ప్రస్తుతం రామ్‌చరణ్‌ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఫారిన్‌లో షూటింగ్‌ పూర్తి చేసుకొచ్చిన ఈ చిత్రం యూనిట్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఓ ప్రత్యేకపాత్రలో కనిపించనున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో చిరుతో పాటు రామ్‌చరణ్‌ బాబాయ్‌ అయిన మెగాబ్రదర్‌ నాగబాబు కూడా ఓ కీలకపాత్రను పోషిస్తున్నాడు. ఇటీవలే నాగబాబు, రామ్‌చరణ్‌కు సోదరిగా నటిస్తోన్న కృతికర్బందాలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తానికి ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్న వాలకం చూస్తుంటే ఈ మూవీ సంచలన విజయం సాధించడం ఖాయమని ట్రేడ్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రం టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ను చిరు బర్త్‌డే కానుకగా ఆగష్టు 22న విడుడల చేయనున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs