‘బాహుబలి’ చిత్ర అఖండ విజయంతో బెంగళూరు సుందరి అనుష్క పాపులారిటీ మరింత పెరిగింది. ఈ చిత్రంలో దేవసేనగా డీ గ్లామర్ పాత్రలో కనిపించినా..ఆమె పాత్రకు మంచి స్పందన లభించింది. ఇదిలావుండగా అనుష్క నటించిన చారిత్రక చిత్రం ‘రుద్రమదేవి’ సెప్టెంబర్ 4న ప్రేక్షకులముందుకురానుంది. ఈ రెండు చిత్రాలకోసం దాదాపు మూడేళ్లుగా శ్రమించింది అనుష్క. గుర్రపు స్వారీ, కత్తియుద్ధాలు ఇలా శారీరకంగా, మానసికంగా ఎంతగానో కష్టపడింది అనుష్క. అంతేకాదు ఈ క్రమంలో పలు భారీ చిత్రాల ఆఫర్‌లను సైతం వదులుకుంది. అయితే ఇక కొంతకాలం పాటు తన సినిమాల పంథాను మార్చుకోవాలని నిర్ణయించుకుందట అనుష్క. బాహుబలి, బాహుబలి-2, రుద్రమదేవి చారిత్రక చిత్రాలతో అలిసిపోయిన అనుష్క ఇలాంటి సినిమాలకు కొంత విరామమిచ్చి రాబోవురోజుల్లో పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ పాత్రలపై దృష్టిపెట్టాలని నిర్ణయించుకుందని తెలిసింది. అందులో భాగంగానే ప్రస్తుతం ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ‘సైజ్‌జీరో’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది అనుష్క. వినూత్న కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె పాత్ర రెండుకోణాల్లో సాగుతుందని తెలిసింది. అంతేకాదు అనుష్క ఈ చిత్రంలో కాస్త హాట్‌హాట్‌గా కూడా కనిపిస్తుందని ఫిల్మ్‌నగర్ టాక్.