నాగార్జున హీరోగా వచ్చిన 'సంతోషం' సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి గ్రేసీసింగ్. ఆ తర్వాత ఆమె రెండు మూడు చిత్రాల్లో నటించి ఫేడవుట్ అయింది. అచ్చు తెలుగమ్మాయిలా ఉండే ఈ భామ మరలా రీఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్‌లో మిరాఖ్‌మీర్జా దర్శకత్వంలో 'గాంధీ ది హీరో' అనే చిత్రంలో ఆమె నటిస్తోంది. ఈ చిత్రంలో గాంధీ విలువలను ఆచరించి, తత్వాన్ని బోధించే ఓ సన్యాసిని (నన్) పాత్రలో ఆమె కనిపించనుంది. ఈమె ఓకే అంటే టాలీవుడ్‌లో కూడా ఈమెకు అమ్మ, అక్క, వదిన వంటి పలు క్యారెక్టర్ పాత్రలు వచ్చే అవకాశం ఉంది. మరి ఈసారి ఆమె తన దృష్టిని టాలీవుడ్‌పై కేంద్రీకరిస్తుందా? లేదా? అనేది వేచిచూడాలి..!