ఇప్పటివరకు టాలీవుడ్‌లో స్టార్‌హీరో ఇమేజ్ ఉన్న ప్రభాస్ 'బాహుబలి'తో దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో కూడా పాపులర్ అయ్యాడు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృస్టించడంతో ఇప్పుడు ఆయన నటించిన పలు హిట్ సినిమాలను మిగతా భాషల్లో అనువాదం చేసేందుకు అక్కడి నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఆయన నటించిన 'మిర్చి' చిత్రాన్ని త్వరలో మలయాళంలో అనువాదం చేయనున్నారు. 'బాహుబలి' కి క్రేజ్ ఉన్న సమయంలోనే ఈ హిట్ మూవీని డబ్ చేసి రిలీజ్ చేసేందుకు వారు సిద్దమవుతున్నారు. ఇంతవరకు మాలీవుడ్‌లో అల్లుఅర్జున్‌కు మాత్రమే మంచి క్రేజ్ ఉంది. అతన్ని అక్కడ మల్లుఅర్జున్ అని పిలుస్తుంటారు. బన్నీ ఇచ్చిన స్ఫూర్తితో మలయాళ మార్కెట్‌లో పాగా వేసేందుకు మరికొందరు టాలీవుడ్ హీరోలు పోటీపడుతున్నారు. ఇలాంటి సమయంలో మలయాళంలో అల్లుఅర్జున్‌కు గట్టిపోటీ ఇవ్వడానికి ప్రభాస్ ముందుకొస్తున్నాడు. అందులోనూ 'మిర్చి'లో సత్యరాజ్, నదియా వంటి మలయాళ ప్రేక్షకులకు చిరపరిచితమైన వారు ఉండటం కలిసొచ్చే అంశం. మరి అక్కడ బన్నీ, ప్రభాస్‌ల మధ్యపోటీ రసవత్తరంగా ఉంటుందనే చెప్పాలి.