ప్రముఖ బాలీవుడ్ హీరో అభిషేక్‌బచ్చన్ తను పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌కు పెద్ద అభిమానిని అని చెప్పాడు. ఆయన మెగా ఫ్యామిలీతో తనుకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో ఇష్టమని, అలాగే తాను పవన్‌కల్యాణ్‌కు వీరాభిమానిని అని ఆయన చెప్పుకొచ్చాడు. ఆయన నటించే సినిమాలు మిస్ కాకుండా చూస్తుంటాను అని తెలిపాడు. మంచిపాత్ర వస్తే టాలీవుడ్‌లో కూడా సినిమాల్లో నటించడానికి తాను సిద్దమే అని ఆయన పేర్కొన్నాడు. ఇలా బిగ్‌బి కుమారుడు జూనియర్ బచ్చన్ పవన్‌ను ఆకాశానికి ఎత్తడంతో మెగాభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. పవన్ ఇమేజ్ కేవలం తెలుగుకే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా ఆయనకు పెద్ద పెద్దస్టార్లలో కూడా అభిమానులు ఉన్నారని.. ఇది తమ హీరోకు దక్కిన అరుదైన గౌరవమని మెగాభిమానులు పేర్కొంటున్నారు.