Advertisement
Google Ads BL

ఈరోస్‌కు ఐరన్‌ముద్ర తొలగిందా?


ప్రముఖ సినీ పంపిణీ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ డిస్ట్రిబ్యూట్‌ చేసిన అన్ని చిత్రాలు దారుణంగా బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడుతుండటంతో ఈ సంస్థకు ఐరన్‌లెగ్‌ అనే ముద్ర పడింది. అయితే ఇటీవల ఆ సంస్థ బాలీవుడ్‌లో స్టార్‌హీరో సల్మాన్‌ఖాన్‌ నటించిన 'భజరంగీ బాయిజాన్‌'ను డిస్ట్రిబ్యూట్‌ చేసింది. ఈ చిత్రం 500కోట్లను దాటి 700వ కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. దీంతో ఈరోస్‌కు భారీ లాభాలు వస్తున్నాయి. అలాగే ఈ సంస్థ ఇటీవలికాలంలో తెలుగులో మహేష్‌బాబు నటించిన '1' (నేనొక్కడినే), 'ఆగడు' చిత్రాలను పంపిణీ చేసి చేతులు కాల్చుకోంది. కానీ అనూహ్యంగా ఒకే ఒక్క రాత్రి కుదిరిన డీల్‌లో మహేష్‌బాబు నటించిన 'శ్రీమంతుడు' చిత్రం రైట్స్‌ను సొంతం చేసుకొంది. ఈ డీల్‌ ద్వారా 'శ్రీమంతుడు' నిర్మాతలకు, మహేష్‌కు కూడా భారీ ఆదాయం లభించనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ డీల్‌తో మైత్రి మూవీ మేకర్స్‌ అధినేతలు, మహేష్‌బాబు సేఫ్‌ జోన్‌లోకి వెళ్లిపోయారు. కాగా ప్రస్తుతం 'శ్రీమంతుడు' చిత్రం మంచి పాజిటివ్‌ టాక్‌ సాధిస్తూ, కలెక్షన్లను కొల్లగొడుతుండటంతో ఈరోస్‌కు తెలుగులో కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉండటంతో టాలీవుడ్‌లో కూడా ఈ సంస్థకు ఉన్న ఐరన్‌లెగ్‌ ముద్ర తొలగిపోయినట్లే అని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అంటున్నాయి. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs