Advertisement
Google Ads BL

'శ్రీమంతుడు' విషయంలో అదే నిజమవుతుందా?


మహేష్‌ కొత్త సినిమా వస్తోందంటే అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. ఆడియో రిలీజ్‌ అయిన రోజు నుంచి ఆ వాతావరణం తారాస్థాయికి చేరుకొని సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని ఎదురుచూసేలా చేస్తుంది. అన్ని సినిమాల్లాగే గత సంవత్సరం 'ఆగడు' విషయంలో కూడా అభిమానులు ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకున్నారు. అయితే ఆ సినిమా డిజాస్టర్‌ కావడంతో అభిమానులు నిరాశపడ్డారు. ఈ సంవత్సరం 'శ్రీమంతుడు' అనే సాఫ్ట్‌ టైటిల్‌తో, ఒక కొత్త తరహా కథతో ప్రేక్షకులను, అభిమానులను ఎంటర్‌టైన్‌ చెయ్యడానికి వస్తున్నాడు మహేష్‌. 

Advertisement
CJ Advs

మహేష్‌ గతంలో చేసిన సినమాలతో పోలిస్తే ఈ సినిమాపై మాత్రం ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంత ఎక్స్‌పెక్టేషన్స్‌ లేవన్నది అర్థమవుతోంది. ఎప్పుడైతే 'శ్రీమంతుడు' అనే టైటిల్‌ ఎనౌన్స్‌ చేశారో అప్పటి నుంచి ఈ సినిమా మీద అందరికీ ఇంట్రెస్ట్‌ తగ్గింది. అందుకే ఈ సినిమా కోసం మహేష్‌ కెరీర్‌లోనే ఫస్ట్‌ టైమ్‌ పబ్లిసిటీని కాస్త ఎక్కువగానే చేస్తున్నారు. ఇంతకుముందు సినిమాలకు స్టిల్స్‌గానీ, ప్రోమోస్‌గానీ ఎక్కువ రిలీజ్‌ చేసేవారు కాదు. అలాంటిది లెక్కకు మించి ప్రోమోస్‌, సాంగ్‌ మేకింగ్‌ వీడియోస్‌, మూవీ మేకింగ్‌ వీడియోస్‌.. ఇలా రోజుకొకటి వదులుతున్నారు. మధ్య మధ్యలో ఇంటర్వ్యూలు, ప్రెస్‌మీట్‌లు పెట్టి సినిమాకి హైప్‌ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని ప్రెస్‌మీట్‌లు పెట్టినా, ఎన్ని ట్రైలర్స్‌ రిలీజ్‌ చేసినా, ఎన్ని టీజర్స్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినా ప్రయోజనం మాత్రం శూన్యం అన్నట్టుగానే వుంది. ఎవరిని కదిలించినా ముందు 'శ్రీమంతుడు' సినిమా చూడాలన్న ఉత్సాహం రావడం లేదని చెప్తున్నారు. మహేష్‌ సినిమా రిలీజ్‌ అవుతోందంటే అందులో మహేష్‌ క్యారెక్టర్‌ ఎలా వుండబోతోంది? ఎలాంటి బ్యాక్‌డ్రాప్‌ వుంటుంది? అనే విషయాల్లో ఆడియన్స్‌కి చాలా క్యూరియాసిటీ వుంటుంది. ఈ సినిమా విషయంలో మాత్రం అలాంటి క్యూరియాసిటీ ఎవ్వరికీ లేదనేది అర్థమవుతోంది. 

వీటన్నింటికీ రీజన్‌ ఏమై వుంటుంది? నెలరోజులుగా ఆడియన్స్‌కి పట్టిన 'బాహుబలి' ఫీవరా? అప్పట్లో డిజాస్టర్‌ అయిన 'శ్రీమంతుడు' టైటిల్‌ని ఈ సినిమాకి పెట్టడమా? 'శ్రీమంతుడు' ప్రోమోస్‌గానీ, ట్రైలర్స్‌గానీ, స్టిల్స్‌గానీ 'మిర్చి' చిత్రాన్ని గుర్తు చేయడమా? ఈ సినిమాకి అంత హైప్‌ రాలేదంటే దానికి మొదటి కారణం టైటిల్‌ అనే చెప్పాలి. ఈ టైటిల్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకోలేకపోయింది. ప్రభాస్‌తో కొరటాల శివ చేసిన మొదటి సినిమా 'మిర్చి' ప్రభాస్‌ ఇమేజ్‌కి తగ్గట్టుగా చాలా పవర్‌ఫుల్‌గా వుంది. సినిమాలో ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌, సెంటిమెంట్స్‌ ఎక్కువగా వున్నప్పటికీ టైటిల్‌ చూడగానే సినిమాకి వెళ్ళాలన్న ఉత్సాహం ఆడియన్స్‌కి కలిగింది. 'శ్రీమంతుడు' విషయానికి వస్తే టైటిలే చాలా నీరసంగా వుండడం, ఈ సినిమా లుక్‌ కూడా 'మిర్చి'ని పోలి వుండడంతో ఇది 'మిర్చి2' అవుతుందని కొందరు, అటు తిప్పి ఇటు తిప్పి 'మిర్చి' సినిమానే మళ్ళీ తీస్తున్నాడని కొందరు కామెంట్‌ చేస్తున్నారు. గత 15 సంవత్సరాల్లో మహేష్‌ నటించిన సినిమాల్లో రిలీజ్‌కి ముందు ఇలాంటి బ్యాడ్‌ టాక్‌ రావడం ఇదే ఫస్ట్‌ టైమ్‌ అని చెప్పాలి. అయితే అందరి ఆలోచనలను, అంచనాలను తారుమారు చేసి సినిమా సూపర్‌హిట్‌ అవుతుందని కరడు గట్టిన మహేష్‌ అభిమానులు ధీమాగా చెప్తున్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs