Advertisement
Google Ads BL

పవన్‌ చేస్తాడా...? చేస్తే సంచలనమే!


బాలీవుడ్‌లో ఇటీవల విడుదలై ఘనవిజయం సాధిస్తూ, రికార్డులన్నింటినీ బ్రేక్‌ చేస్తున్న చిత్రం 'భజరంగీ భాయిజాన్‌'. కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌, కరీనాకపూర్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి కబీర్‌ఖాన్‌ దర్శకత్వం వహించాడు. ఓ పాకిస్థాన్‌ బాలికను తన సొంత ఇంటికి చేరుకునేందుకు ఓ భారతీయుడు సహాయం చేసే నేపథ్యంలో తీసిన ఈ చిత్రానికి ఇండియాలోనే కాదు పాకిస్థాన్‌లో కూడా అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఈచిత్రానికి కథను అందించిన ఘనత రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌కు దక్కుతుంది. కాగా ఇప్పుడు టాలీవుడ్‌లో ఈ సినిమా రీమేక్‌ గురించి ఓ సంచలన వార్త అందరినోట వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు రీమేక్‌లో పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటించనున్నాడనే వార్త చక్కర్లు కొడుతోంది. హిందీలో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతల్లో ఒకరైన రాక్‌లైన్‌ వెంకటేష్‌తో కలిసి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించనున్నాడని ఆ వార్తల సారాంశం. ఈ విషయమై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని, పవన్‌ కూడా ఈ చిత్రాన్ని స్వయంగా వీక్షించాడని సమాచారం. ఈ చిత్రం తెలుగు రీమేక్‌కు హరీష్‌శంకర్‌ దర్శకత్వం వహిస్తాడని, గతంలో సల్మాన్‌ఖాన్‌ నటించిన 'దబాంగ్‌'కు రీమేక్‌గా హరీష్‌శంకర్‌ పవన్‌కు 'గబ్బర్‌సింగ్‌' రూపంలో అత్యద్భుతైన హిట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. మరి ఈ వార్తే నిజమైతే టాలీవుడ్‌లో మరో సంచలనం సృష్టించడం ఖాయమని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అంటున్నాయి. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs