Advertisement
Google Ads BL

పవన్ పై మరో సాంగేసుకుంటున్నాడు!


పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ అంటే అభిమానుల్లో ఎంత క్రేజ్‌ ఉందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు సంబంధించిన ఏ విషయమైనా అభిమానులు అమితాసక్తి చూపుతుంటారు. పవన్‌కళ్యాణ్‌ స్ఫూర్తిగా 'పవనిజం' పేరుతో అభిమానులు ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ మీద అభిమానుల్లో ఉన్న ఆసక్తిని గమనించిన ప్రముఖ పాప్‌సింగర్‌ బాబాసైగల్‌ అప్పట్లో పవర్‌స్టార్‌ మీద ఓ పాటను కంపోజ్‌ చేశాడు. అప్పట్లో ఈ పాటకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఆయన మరో పాటను పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ మీద కంపోజ్‌ చేసి విడుదల చేయబోతున్నాడు. పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజునాడు అంటే సెప్టెంబర్‌ 2వ తేదీన ఈ పాటను విడుదల చేయనున్నాడు. 'ఎ పవర్‌ సాంగ్‌' అనే టైటిల్‌తో ఈ పాట విడుదలకానుంది. మరి బాబా సృష్టించిన ఈ పాట మరెంత హిట్‌ అవుతుందో అని మెగా అభిమానుల్లో ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs