Advertisement
Google Ads BL

రాజమౌళి పై కరణ్‌జోహార్‌ ఒత్తిడి ఫలిస్తుందా?


'బాహుబలి' రెండో భాగం ఎలా ఉండబోతోంది? అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన అంశం. ఈ చిత్రానికి 'బాహుబలి-ది కంక్లూజన్‌' అనే టైటిల్‌ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీటికి కంక్లూజన్‌ దొరుకుతుందనే ఉద్దేశ్యంతోనే ఈ టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఈ చిత్రం గురించి సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ముంబై మీడియాలో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. హిందీ వెర్షన్‌ను ప్రమోట్‌ చేసిన కరణ్‌జోహార్‌ ఈ సెకండ్‌ పార్ట్‌ విషయంలో రాజమౌళిపై చాలా ప్రెజర్‌ తెస్తున్నాడని, ఇంతకీ ఏంటా ప్రెజర్‌? అంటే నార్త్‌ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సినిమాలో బాలీవుడ్‌ స్టార్స్‌ని తీసుకోమని చెబుతున్నాడట. అంతేకాదు.. రాజమౌళి ఏ ఆర్టిస్టులను అయితే అడుగుతాడో వారిని ఖచ్చితంగా తీసుకువస్తాను అని రాజమౌళికి చెప్పినట్లు సమాచారం. దాంతో రాజమౌళి ఇప్పుడు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఎంతవరకు నార్త్‌ ఫేస్‌లను మన సౌత్‌ ప్రేక్షకులు ఆదరిస్తారు? అనే సంశయంలో ఉన్న రాజమౌళి ఈ విషయమై తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs