Advertisement
Google Ads BL

'ప్రేమమ్‌' రీమేక్‌లో రోజుకో హీరో!


మలయాళంలో ఘనవిజయం సాధించి విమర్శకుల ప్రశంసలు పొందిన 'ప్రేమమ్‌' చిత్రం రీమేక్‌హక్కులను హీరో రామ్‌ పెద్దనాన్న స్రవంతి రవికిషోర్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రామ్‌ హీరోగా రీమేక్‌ చేయాలని ఆయన ఉత్సాహపడ్డాడు. కానీ ఈ చిత్రం రీమేక్‌లో నటించేందుకు రామ్‌ నో చెప్పాడు. దీంతో ఈ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్‌ శర్వానంద్‌తో చేస్తాడని వార్తలు కూడా వచ్చాయి. కానీ హఠాత్తుగా ఈ చిత్రం రీమేక్‌ను ప్రముఖ నిర్మాత రాధాకృష్ణ సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం రీమేక్‌ హక్కులను తను కొనుక్కొని నాగచైతన్యతో చేయాలని రాధాకృష్ణ భావిస్తున్నాడట. ఎందుకంటే రాధాకృష్ణ దగ్గర నాగచైతన్య డేట్స్‌ ఉన్నాయి. నాగచైతన్య హీరోగా చందుమొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఆయన సంసిద్దుడు అవుతున్నాడు. ఇంతలో 'ప్రేమమ్‌' చిత్రంపై నాగచైతన్య ఆసక్తి కనపరచడంతో ఆ చిత్రాన్ని నాగచైతన్య, చందుమొండేటిల కాంబినేషన్‌లో తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs