రాధికాఆప్టే మన హీరలపై ఈమధ్య తరచుగా మండిపడుతోంది. సౌత్ సినిమాల్లో హీరోలదే ఆధిపత్యం. హీరోయిన్లకు అంతగా ప్రాధాన్యం ఇవ్వరని ఫీలైంది. ఇప్పుడు మరో భామ కూడా రాధికకు గొంతు కలిపింది. తనే.. నిత్యామీనన్. తన కెరీర్ ముందు నుంచీ చాలా చూజీగా సినిమాలను ఎంచుకుంటూ వస్తోంది నిత్య. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను అసలు ఒప్పుకోదు. హీరో పాత్రని డామినేట్ చేసే సినిమాలలో ఎక్కువ చేసింది. తను మాట్లాడుతూ... దక్షిణాదిన చిత్ర సీమ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మరీ ముఖ్యంగా తెలుగు, తమిళ రంగాలలో హీరో చెప్పిందే వింటారు. హీరో చుట్టూనే సినిమాలు తిరుగుతాయి. అలాంటప్పుడు కథానాయికలెందుకు? నేనైతే అలాంటి సినిమాలను ఒప్పుకోను. నాకు కథే కాదు... నా పాత్ర కూడా నచ్చాలి.. అంటూ రెబెల్‌గా మాట్లాడుతోంది ఈ కేరళ కుట్టి.