చరణ్ అంటే మెగాస్టార్ తనయుడు, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ అనుకుంటారేమో..! ఆయన ఇప్పుడప్పుడే మారుతి ప్రొడక్షన్ చేయడులే కానీ, ఇక్కడ చరణ్ మాత్రం ప్రస్తుతం 'లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి' చిత్రంలో నటిస్తున్న చరణ్ . చరణ్ నటించే తదుపరి చిత్రం మారుతి ప్రొడక్షన్‌లో ఉండబోతుందని..తాజాగా జరిగిన 'లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి' చిత్ర లోగో లాంఛ్ వేదికపై దర్శకుడు మారుతి ప్రకటించారు.
'లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి' చిత్రం కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో తెరకెక్కుతుంది. ఇందులో కృష్ణ-జనని, అఖిల్-భార్గవి, చరణ్-ప్రజ్ఞ అనే మూడు జంటలు హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. మారుతి నిర్మించబోయే తదుపరి చిత్రంలో చరణ్ సోలో హీరోగా అరంగేట్రం చేయనున్నాడు.