వాస్తవానికి స్టార్‌హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు కత్తులు నూరుతుంటారు. వీలుంటే చాలు వాదనలకు దిగుతుంటారు. కానీ నేటితరం యంగ్ హీరోలు మాత్రం చాలా క్లోజ్‌గా ఉంటుంటారు. ఒకరి సినిమాకి మరొకరు క్లాప్ కొడుతుంటారు. వీలుంటే ఒకరి సినిమాకి మరోకరు వాయిస్ ఓవర్ అందిస్తుంటారు. కాగా సినిమాల పరంగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ వాస్తవానికి రియల్ లైఫ్‌లో వారిద్దరూ మంచి క్లోజ్ ఫ్రెండ్స్. తాజా విశేషం ఏమిటంటే... ప్రస్తుతం రామ్‌చరణ్ శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి 'మై నేమ్ ఈజ్ రాజు, బ్రూస్లీ, విజేత, ఫైటర్' అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ చిత్రానికి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్‌తో పాటు, శ్రీనువైట్లతో ఉన్న అనుబంధం రీత్యా ఎన్టీఆర్ ఈ చిత్రానికి వాయిస్ ఇస్తున్నాడని సమాచారం.