తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ, తనకు వచ్చిన యాడ్స్‌లో నటిస్తూ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయే మహేష్ హఠాత్తుగా ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే బేనర్‌ని స్టార్ట్ చేసి ఆ బేనర్‌లో సినిమాలు నిర్మిస్తానంటూ చెప్పడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. మొదటి ప్రాజెక్ట్‌గా మైత్రి మూవీస్‌తో కలిసి 'శ్రీమంతుడు' చేస్తున్నట్టు ప్రకటించాడు. దీని తర్వాత 'బ్రహ్మూెత్సవం' కూడా అతని బేనర్‌లోనే రాబోతోంది. తన బేనర్‌లోనే సినిమాలు చేస్తానని చెప్పిన మహేష్ మైత్రి మూవీ మేకర్స్‌లో కలిసి 'శ్రీమంతుడు' చెయ్యడానికి రీజన్ వుందట. 'మిర్చి' సినిమా చూసిన తర్వాత కొరటాల శివకి పెద్ద ఫ్యాన్ అయిపోయాడు మహేష్. ఆ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్, శివ టేకింగ్ బాగా నచ్చడంతో నెక్స్‌ట్ మూవీ శివతో చెయ్యాలని డిసైడ్ అవ్వడమే కాకుండా అది కూడా తను ప్రొడ్యూస్ చెయ్యాలని అనుకున్నాడు. అయితే చివరి క్షణంలో కొన్ని కారణాల వల్ల మైత్రి మూవీ మేకర్స్ అధినేతలకు ఈ సినిమా చెయ్యాల్సి వచ్చింది. అయితే తన సొంత బేనర్‌తో కలిసి ఈ సినిమా చెయ్యమని నిర్మాతలకు చెప్పడంతో వారు కూడా ఓకే అన్నారు. అలా ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్ర నిర్మాణంలోకి దిగింది.