'అందాల రాక్షసి' ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ లావణ్యత్రిపాఠి. ఆ తర్వాత ఆమెకు 'దూసుకెళ్తా' చిత్రంలో అవకాశం వచ్చినా ఆమె కెరీర్ దూసుకెళ్లలేకపోయింది. అయితే ఇప్పుడిప్పుడే ఈ అమ్మడు కెరీర్ ఓ గాడిలో పడుతున్నట్లు అర్ధమవుతోంది. ఆమె ప్రస్తుతం నాగార్జున హీరోగా నటిస్తున్న 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రంలో యంగ్ నాగార్జునకు జోడీగా నటిస్తోంది. అలాగే గీతాఆర్ట్స్, యువి క్రియేషన్స్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న 'భలే భలే మగాడివోయ్' చిత్రంలో నాని సరసన నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె పర్‌ఫార్మెన్స్‌కు, స్క్రీన్ ప్రజెషన్స్‌కు ఇంప్రెస్ అయిన అల్లుఅరవింద్ తన చిన్న కుమారుడు అల్లుశిరీష్ హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న తాజా చిత్రంలో ఎందరో హీరోయిన్ల పేర్లను పరిశీలించినప్పటికీ చివరకు లావణ్యత్రిపాఠినే హీరోయిన్‌గా ఎంపికచేశారు. త్వరలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. మరి మెగా హీరోలు తమ హీరోయిన్స్ ని ఎలా చేంజ్ చేస్తుంటారో తెలిసిందే కాబట్టి..లావణ్య కూడా మెగా హీరోలందరితో నటించి మెగా హీరోయిన్ ముద్ర వేయించుకుంటుందేమో చూద్దాం!