Advertisement
Google Ads BL

ఐటెం సాంగ్ కు తమన్నానే కావాలంటున్నాడు!


సుకుమార్‌ సినిమా అంటే అందులో అదిరిపోయే ఐటంసాంగ్‌ ఉండటం ఆనవాయితీ. అందులోనూ ఆయన దేవిశ్రీప్రసాద్‌తో జోడీ కడితే ఇక చెప్పనవసరం లేదు. ఓ పక్కా మాస్‌ ట్యూన్‌ రెడీ అయిపోతుంది. బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా సుకుమార్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌ జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం లండన్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి 'మా నాన్నకు ప్రేమతో' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ చిత్రంలో కూడా సుకుమార్‌-దేవిశ్రీప్రసాద్‌ల టైప్‌లో ఓ మాంచి ఐటం సాంగ్‌ ఉందని సమాచారం. ఆ పాటలో తమన్నాను నటింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే ఆమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తెరంగేట్రం చేసిన 'అల్లుడుశీను' చిత్రంలో తమన్నా ఐటంసాంగ్‌లో కనిపించింది. అలాగే ఆమెకు సుకుమార్‌తో మంచి అనుబంధం ఉంది. దీంతో ఈ పాటకు తమన్నా కాదనే అవకాశాలు లేవని, ఆమె ఎన్టీఆర్‌-సుకుమార్‌ల చిత్రంలో ఐటం సాంగ్‌ చేయడం ఖాయం అని తెలుస్తోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs