Advertisement
Google Ads BL

ఇలియానా కంటే ఎక్కువ కిక్ ఇస్తుందట!


ప్రస్తుతం టాలీవుడ్‌లో రకుల్‌ప్రీత్‌సింగ్‌ హవా నడుస్తోంది. ఎవరి నోట విన్నా ఈ అమ్మడి పేరే వినిపిస్తోంది. ప్రస్తుతానికి టాలీవుడ్‌ నెంబర్‌వన్‌ రకులే అని కళ్లు మూసుకొని చెప్పవచ్చు. అయితే ఇంతకాలం ఆమె పెద్దగా గ్లామర్‌షో చేసింది లేదు. కానీ 'కిక్‌2'లో మాత్రం ఆమె రెచ్చిపోయి గ్లామర్‌షో చేయనుందట. వాస్తవానికి హీరోయిన్లను గ్లామర్‌గా చూపించడంలో దర్శకుడు సురేందర్‌రెడ్డికి ప్రత్యేకశైలి ఉంది. దానికి ఉదాహరణ 'కిక్‌' చిత్రంలో ఆయన ఇలియానాను చూపించిన విధానం యువతను ఉర్రూతలూగించింది. ఒకవిధంగా ఇలియానా నటించిన చిత్రాల్లో 'కిక్‌'దే అగ్రస్థానం అంటే ఒప్పుకోకతప్పదు. ఇప్పుడు సురేందర్‌రెడ్డి రకుల్‌ప్రీత్‌సింగ్‌ను కూడా హాట్‌ హాట్‌గా యువతరాన్ని ఆకర్షించేలా ఎంతో అందంగా చూపిస్తున్నాడట. ఈ చిత్రానికి రకుల్‌ గ్లామర్‌ కూడా ఓ పెద్ద అస్సెట్‌ అని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల సరరస ఆమె నటిస్తోంది. ఇప్పటికీ ఆమె పవన్‌తో గానీ మహేష్‌తో గానీ చేయలేదు. మహేష్‌దైతే దీనగాధ. ఎవరైనా తనతో నటించడానికి పోటీ పడతారని, తాను అవకాశం ఇస్తే పరుగెత్తి చేస్తారని భావించే మహేష్‌కు, ఆయన అభిమానులకు రకుల్‌ ఝల్లక్‌ ఇచ్చింది. 'బ్రహ్మూెత్సవం'లో ఆమెను నటింపజేయాలని కాళ్లకు చెప్పులు అరిగేలా తిరిగినా ఆమె డేట్స్‌ లేవనే ఒంకతో నో అంది. అదే సమయంలో ఎన్టీఆర్‌ సినిమాను ఒప్పుకొంది కానీ మహేష్‌ కోసం ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లను ఆమె వదులుకోలేదు. మరి మహేష్‌ను ఇన్ని తిప్పలు పెట్టిన ఆమెను చూస్తేనే కాదు... ఆమె పేరు విన్నా కూడా మహేష్‌ అభిమానులకు పడటం లేదు. కానీ ఎవరు ఒప్పుకొన్నా, ఒప్పుకోకపోయినా ప్రస్తుతం టాలీవుడ్‌ నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ మాత్రం రకులే అని చెప్పకతప్పదు. కాగా 'కిక్‌2'చిత్రాన్ని ఆగష్టు 22న విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs