సౌత్‌ఇండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ తన ‘లింగ’ డిజాస్టర్ తర్వాత కొత్త చిత్రాన్ని యువ దర్శకుడు రంజిత్‌తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి నిర్మించనున్నారు. ఆగష్టు 2న ముహూర్తం ఫిక్స్ అయిన ఈ చిత్రం ఆగష్టు మూడో వారంలో మలేషియాలో షూటింగ్‌ను జరుపుకోనుంది. ఈలోగా కథానాయికను ఎంపిక చేసే పనిలో యూనిట్ బృందం ఉంది. ఇక రజనీతో నటించే లక్కీ ఛాన్స్ రాధికాఆప్టేకు దక్కించుకుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్న రంజిత్ ఎక్కువగా వాస్తవికత ఉట్టిపడే చిత్రాలను తీయడంలో మంచి దిట్ట అని.. ఇప్పటివరకు ఆయన దర్శకత్వం వహించిన రెండు చిత్రాలు అదే కోవకు చెందినవని తెలిసిన సంగతే. అందుకే రాధికాఆప్టే వంటి నటిని ఎంచుకున్నాడని, సినిమాలో ఈమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ‘లెజెండ్, లయన్’ వంటి చిత్రాల్లో నటించి టాలీవుడ్‌పై పలు విమర్శలు చేసిన ఈమెకు రజనీ సినిమాలో నటించే అవకాశం రావడం గోల్డెన్ చాన్స్ అని ఒప్పుకోకతప్పదు.