Advertisement
Google Ads BL

నాగ్ కి అఖిల్ ఇచ్చే పుట్టినరోజు కానుక!


ప్రస్తుతం వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో నితిన్‌ తండ్రి సుధాకర్‌రెడ్డి నిర్మాణంలో హీరోగా అరంగేట్రం చేస్తోన్న యంగ్‌ హీరో అక్కినేని అఖిల్‌. ఆయన నటిస్తున్న చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.  ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 22న దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టీజర్‌ను నాగార్జున పుట్టినరోజు కానుకగా ఆగష్టు 29న విడుదల చేయాలని నిర్ణయించారు. టీజర్‌తోపాటు ఈ చిత్రం టైటిల్‌ను కూడా అదేరోజు రివీల్‌ చేయడానికి సిద్దమవుతున్నారు. ఈ చిత్రానికి ‘మిస్సైల్‌’ అనే టైటిల్‌ను పెట్టనున్నట్లు ఆమధ్య వార్తలు వచ్చాయి. అయితే వాటిని నిర్మాతలు ఖండిరచారు. మరి అక్కినేని కుటుంబ వారసుడైన అఖిల్‌ చిత్రానికి ఎలాంటి టైటిల్‌ ఫిక్స్‌ చేస్తారో వేచిచూడాలి!  ఈ చిత్రంలో అఖిల్‌ సరసన హీరోయిన్‌గా సాయేషాసైగల్‌ అనే కొత్త అమ్మాయిని పరిచయం చేస్తున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs