Advertisement
Google Ads BL

రెండో షెడ్యూల్‌ లో పవన్ కళ్యాన్!


పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ హీరోగా శరత్‌మరార్‌ నిర్మాతగా బాబి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గబ్బర్‌సింగ్‌2’. ఈ చిత్రాన్ని ఎప్పటినుండో అనుకుంటున్నప్పటికీ నిన్నమొన్నటివరకు సెట్స్‌పైకి వెళ్లలేదు. ఎట్టకేలకు ఇటీవల మహారాష్ట్రలోని ఓ గ్రామంలో ఓ వారం రోజుల షూటింగ్‌ జరిగింది. కానీ ఈ షెడ్యూల్‌లో పవన్‌ పాల్గొనలేదు. మరలా ఈ చిత్రానికి చాలా గ్యాప్‌ రావడంతో అసలు ప్రాజెక్ట్‌ ఉంటుందా? లేదా? అనే వీమాంశలో ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా పవన్‌ అభిమానులు పడిపోయారు. ఎట్టకేలకు ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ ఆగష్టు 5 నుండి జరుగనుంది. ఈ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోనే జరపనున్నారు. ఎక్కువ భాగం షూటింగ్‌ను రామోజీ ఫిల్మ్‌సిటీ, అన్నపూర్ణ స్టూడియోలో ప్లాన్‌ చేస్తున్నారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ రెండో షెడ్యూల్‌ మొత్తం పవన్‌ పాల్గొననున్నాడు. మొత్తానికి చాలారోజుల తర్వాత పవన్‌ అభిమానులకు ఇదో తీపివార్త అని చెప్పకతప్పదు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs