‘బాహుబలి’ సినిమాకు పనిచేసిన మరో ఆర్ట్ డైరెక్టర్ మను జగద్ అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. రాజమౌళి, ‘బాహుబలి’ టీం తనను మోసం చేసినట్లు ఆయన ఫీలవుతున్నాడు. తనకు కనీసం టైటిల్ క్రెడిట్ కూడా ఇవ్వక పోవడంపై ఆయన ఆవేదన చెందుతున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ప్రొడక్షన్ డిజైనర్ సాబుశిరిల్ వివరణ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. మను జగద్ టీంతో కలిసి ఏడునెలలు పనిచేశాడు. అలాగే మాకు మరో ఆర్ట్ డైరెక్టర్ అనీల్ జాదవ్ కూడా ఉన్నాడు. అయితే మనుని క్రెడిట్స్ నుండి తొలగించడం మాత్రం ఓ పొరపాటే. ఇలాంటి విషయాలను ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ చూసుకుంటుంది. తప్పనిసరిగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పొరపాటును త్వరలో రెక్టిఫై చేస్తాం... అని తెలిపారు.