Advertisement
Google Ads BL

అఖిల్‌ సినిమాకు డేట్‌ ఫిక్సయిందా?


ప్రస్తుతం అక్కినేని అఖిల్‌ హీరోగా వినాయక్‌ డైరెక్షన్‌లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.  అఖిల్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న ఈ చిత్రాన్ని హీరో నితిన్‌, ఆయన తండ్రి సుధాకర్‌రెడ్డిలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సాయేసా సైగల్‌ హీరోయిన్‌గా పరిచయం అవుతోన్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం సౌత్‌ ఆఫ్రికాలో జరుగుతోంది. అక్కడ కొన్ని పాటలను, సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి అనూప్‌రూబెన్స్‌, తమన్ లు సంయుక్తంగా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 22న విడుదల చేయాలనే ప్లానింగ్‌లో ఉన్నారు. అయితే ఆ ముందువారమే అంటే అక్టోబర్‌ 15న రామ్‌చరణ్‌, శ్రీనువైట్ల సినిమా విడుదల కానుంది. మరి రామ్‌చరణ్‌ చిత్రానికి కేవలం వారం గ్యాప్‌లో వస్తున్న ఈ చిత్రానికి మంచి పోటీనే ఎదురు అవుతున్నప్పటికీ దసరా సెలవులను క్యాష్‌ చేసుకోవాలంటే అదే తేదీన విడదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని యూనిట్‌ సభ్యుల సమాచారం. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs