‘బాహుబలి’ చిత్రంలో రమ్యకృష్ణ శివగామి పాత్ర ఎంత ముఖ్యమైనదో సినిమా విడుదలైన తర్వాత అందరికీ అర్థమైంది. ఆ పాత్రలో రమ్యకృష్ణ అభినయం అద్భుతం. అసలు ఆమె తప్ప ఆ పాత్రకు మరెవ్వరూ న్యాయం చేయలేరనే రేంజ్‌లో ఆమె నటన అదరగొట్టింది. వాస్తవానికి ఆ పాత్రకు ఆమె తొలి చాయిస్ కాదు. ‘బాహుబలి’ని బాలీవుడ్‌లో కూడా విడుదల చేయాలని నిర్ణయించుకున్న తరుణంలో రాజమౌళి ఆ పాత్రకు బాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న నటిని తీసుకోవాని భావించాడు. ఇందుకోసం సుస్మితాసేన్, శ్రీదేవి లను సంప్రదించాడు. శ్రీదేవి ఈ పాత్ర కోసం ఆరు కోట్లు డిమాండ్ చేసిందిట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కోసం శ్రీదేవికి ఆరుకోట్లు రెమ్యూనరేషన్ పెద్ద విషయం ఏమీ కాదు. అయినా కూడా ఎందువల్లో చివరకు రమ్యకృష్ణను ఖరారుచేశారు. రమ్యకృష్ణ పెర్ఫార్మెన్స్ చూసిన వారు ఒకవేళ శ్రీదేవి ఆ పాత్రను చేసి ఉంటే ఈ రేంజ్‌లో పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఉండేది కాదేమో అనే అభిప్రాయం అందరిలో వ్యక్తం అవుతోంది.