రామ్‌చరణ్, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో ఓ చిత్రం శరవేగంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బ్రహ్మాజీకి డూప్‌గా రామ్‌చరణ్ కనిపించనున్నాడు. అయితే ఫైట్స్‌లో రామ్ చరణ్ డబల్ బాడీ తో కనపడతాడని అంటున్నారు. ఈ సీన్స్ ఫుల్ కామెడీతో నడుస్తాయని చెబుతున్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ స్టంట్‌మేన్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. సినిమాకు పనిచేసే ఆ స్టంట్ మ్యాన్ తన వృత్తిలో భాగంగా అప్పటికీ హీరోగా చేస్తున్న బ్రహ్మాజీకి బాడీ డబుల్‌గా కనపడి ఫైట్స్ చేస్తాడన్నమాట. ఈ సీన్స్‌ని రీసెంట్‌గా శ్రీనువైట్ల చిత్రీకరించాడు.